డీఎంహెచ్‌ఓ మెరుపు తనిఖీ: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ జైపూర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ, ప్రభుత్వ ప్రసవాలు పెంచాలని ఆదేశించారు. రికార్డుల నిర్వహణపై ఫార్మసిస్ట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ‘ఈ-ఔషధ’ పోర్టల్‌లో రోజువారీ వివరాలు నమోదు చేయాలన్నారు.
వాతావరణ మార్పుల నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రాపిడ్ డయాగ్నస్టిక్ కిట్లు, పాము కాటు, కుక్క కాటు మందులు, ఓఆర్‌ఎస్ అందుబాటులో ఉంచాలన్నారు. హై-రిస్క్ గర్భిణులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అత్యవసర పరిస్థితుల కోసం 'రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్' ఏర్పాటు చేయాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలో వైద్యాధికారి డాక్టర్ ముస్తాఫా, సిబ్బంది పాల్గొన్నారు.