అనుమానపు వేధింపులకు టీచర్ బలి: జన్నారంలో విషాదం
అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడి.. ఆసుపత్రిలో జ్యోత్స్న కన్నుమూత
భర్త అనుమానపు వేధింపులు భరించలేక జ్యోత్స్న(27) అనే ప్రైవేట్ టీచర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జ్యోత్స్నకు జన్నారం మండలం రెండ్లగూడకు చెందిన నాగరాజుతో ఐదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 4 ఏళ్ల బాబు ఉన్నాడు. దుబాయ్ నుండి వచ్చిన భర్త నాగరాజు.. అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో జ్యోత్స్నను శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు.
ఈ నెల 20న అర్ధరాత్రి భర్త కొడుతుండగా జ్యోత్స్న తండ్రికి ఫోన్ చేసింది. కూతురి ఆర్తనాదాలు తండ్రి ఫోన్లోనే విన్నాడు. ఆ తర్వాత వేధింపులు తట్టుకోలేక జ్యోత్స్న మందుబిళ్లలు మింగి, చున్నీతో ఉరేసుకుంది. మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆమె కన్నుమూసింది. భర్త నాగరాజు, అత్త లక్ష్మి, బావ నరేష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు.