మంచిర్యాల: మృత్యువుతో పోరాడి.. ఆరుగురు ఓడిపోయారు
జనం పవర్ జర్నలిస్ట్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ వేల్పుల నాగేష్:
నస్పూర్ గేట్ రోడ్డు ప్రమాదం ఆరు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.
మంచిర్యాల జిల్లా నస్పూర్ గేట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు యువతుల జీవితాలను అర్ధంతరంగా ముగించింది. లారీ, ఆటో ఢీకొన్న ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక్కొక్కరుగా మృత్యువాత పడ్డారు. దీంతో ఆరు కుటుంబాల్లో కన్నీరు మిగిలింది.
బతుకులో స్థిరపడాలని, కుటుంబానికి అండగా నిలవాలని అడుగులు వేస్తున్న ఆ యువతుల జీవితాలను నస్పూర్ గేట్ ప్రమాదం మధ్యలోనే ఆపేసింది. ప్రమాదం తర్వాత మృత్యువుతో పోరాడినప్పటికీ చివరకు ప్రాణాలు నిలవలేదు. ఒకేసారి ఆరుగురు యువతులను కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ ఘటనలో అనూష మృతి మరింత విషాదకరంగా మారింది. ఉద్యోగంలో చేరి కేవలం మూడు రోజులే గడవకముందే ప్రమాదం ఆమె జీవితాన్ని బలిగొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనూష మెదడులో రక్తం గడ్డకట్టడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి నీరు చేరింది. చికిత్స పొందుతున్న సమయంలో రక్తంలో ఇన్ఫెక్షన్ సోకడంతో పరిస్థితి విషమించి శనివారం మృతి చెందింది.
అనూష మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు బంధువులకు అప్పగించారు. అప్పటి వరకు ఆసుపత్రిలో తమ బిడ్డ కోలుకుంటుందనే ఆశతో ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు ఆమె మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఆరుగురు యువతుల మృతితో నస్పూర్ గేట్ వద్ద భద్రతా చర్యలు, రహదారి పరిస్థితులు, వాహనాల వేగ నియంత్రణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆరు కుటుంబాల ఆశలు.. ఆరుగురు యువతుల భవిష్యత్తు.. ఒక్క ప్రమాదంతో చీకటిలో కలిసిపోయాయి.