జైనూర్ మార్కెట్ యార్డులో 12 సముదాయ గదుల ప్రారంభం: పాల్గొన్న ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, కోవా లక్ష్మి

​రైతుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ​సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి, రిబ్బన్ కట్ చేసిన ప్రజాప్రతినిధులు ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో రైతులకు మరింత మేలు చేకూర్చే విధంగా మౌలిక వసతుల కల్పన జరిగింది. జైనూర్ మార్కెట్ యార్డు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన 12 సముదాయ గదుల (గోదాముల) ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయ పూజారుల మంత్రోచ్ఛారణల మధ్య ఎమ్మెల్యేలు టెంకాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ఈ...