యువతే లక్ష్యం.. చైతన్యమే మార్గం: జన్నారంలో మత్తు పదార్థాలపై విద్యార్థుల భారీ అవగాహన ర్యాలీ
తుడుం జితేందర్ నేటి యువత, భావి భారత పౌరులు మత్తు పదార్థాల బారిన పడి తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకోకూడదనే దృఢ సంకల్పంతో జన్నారం పోలీసులు సరికొత్త అడుగు వేశారు. డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయంగా స్థానిక పోలీసు యంత్రాంగం విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా, స్థానిక పోనకల్ రామాలయం నుండి బస్ స్టాండ్ వరకు పాఠశాల విద్యార్థులతో కలిసి నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. "డ్రగ్స్ వద్దు.. ఆరోగ్యం ముద్దు!" అంటూ జన్నారం వీధుల్లో విద్యార్థులు చేసిన నినాదాలు మార్మోగాయి. కన్నులపండువగా ర్యాలీ.. ఆలోచింపజేసే నినాదాలు జన్నారం ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ...