జన్నారం పోనకల్‌లోని అక్టోబర్ 4న మెగా ఉచిత వైద్య శిబిరం

ముఖ్య అతిథిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జన్నారం: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో జన్నారం మండలం పోనకల్ గ్రామంలో అక్టోబర్ 4న మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. చందా న్యూరో అండ్ ట్రామా కేర్ సెంటర్ సహకారంతో పానకల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్, లయన్స్ క్లబ్ ఆఫ్ జన్నారం సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జన్నారం పోనకల్‌లోని పోలీస్ స్టేషన్ సమీపంలోని స్లేట్ సీబీఎస్‌ఈ పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం...