మంచిర్యాల: మృత్యువుతో పోరాడి.. ఆరుగురు ఓడిపోయారు

జనం పవర్ జర్నలిస్ట్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ వేల్పుల నాగేష్: నస్పూర్ గేట్ రోడ్డు ప్రమాదం ఆరు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ గేట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు యువతుల జీవితాలను అర్ధంతరంగా ముగించింది. లారీ, ఆటో ఢీకొన్న ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక్కొక్కరుగా మృత్యువాత పడ్డారు. దీంతో ఆరు కుటుంబాల్లో కన్నీరు మిగిలింది. బతుకులో స్థిరపడాలని, కుటుంబానికి అండగా నిలవాలని అడుగులు వేస్తున్న ఆ యువతుల జీవితాలను నస్పూర్ గేట్ ప్రమాదం మధ్యలోనే ఆపేసింది. ప్రమాదం తర్వాత మృత్యువుతో పోరాడినప్పటికీ చివరకు ప్రాణాలు నిలవలేదు. ఒకేసారి ఆరుగురు యువతులను...