వైద్యం కోసం వచ్చిన వారికి భోజనం.. వృద్ధుల మనసు గెలిచిన సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్
పొనకల్లో సేవకు జనం జైకొట్టారు జన్నారం లోని ఆస్పత్రి ఖర్చులు భరించలేని పేదలకు వైద్యం అందితే.. అంతకంటే గొప్ప సేవ మరొకటి ఉండదు. జన్నారం మండలం పొనకల్లో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. వైద్యం కోసం వచ్చిన రోగులకు పరీక్షలు, మందులతో పాటు భోజనం కూడా ఏర్పాటు చేయడంతో కార్యక్రమానికి హాజరైన ప్రజలు నిర్వాహకులను అభినందించారు. పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్, లయన్స్ క్లబ్ ఆఫ్ జన్నారం ఆధ్వర్యంలో చందా న్యూరో అండ్ ట్రామా కేర్ సెంటర్ సహకారంతో ఈ శిబిరం నిర్వహించారు. మండలంలోని 29 గ్రామపంచాయతీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వృద్ధులు, మహిళలు, దీర్ఘకాలిక...