రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు మందమర్రి విద్యార్థి ఎంపిక
జనం పవర్ జర్నలిస్టు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి వేల్పుల నగేష్ అక్టోబర్ 11, కృష్ణవేణి టాలెంట్ పాఠశాలకు గర్వకారణంగా ఎస్.కె. షాహాబాజ్ మందమర్రి: జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చాటుకుని రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికై మందమర్రి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడు స్థానిక కృష్ణవేణి టాలెంట్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థి ఎస్.కె. షాహాబాజ్. తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న అండర్-17 రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో అతడు పాల్గొననున్నాడు. ఈ నెల 12వ తేదీ నుంచి హైదరాబాద్లో జరగనున్న రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో షాహాబాజ్ తన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నాడు. జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత...