జర్నలిస్టుల ఐక్యతే లక్ష్యం.. దండేపల్లి ప్రెస్ క్లబ్‌కు కొత్త నాయకత్వం!

జనం పవర్ జర్నలిస్ట్ దండేపల్లి మండలం ఎస్.కె సద్దాం హుస్సేన్ దండేపల్లి మండల ప్రెస్ క్లబ్‌కు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సర్వసభ్య సమావేశంలో సభ్యుల సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బండి రవిగౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఎనగందుల సత్యం బాధ్యతలు చేపట్టనున్నారు. జర్నలిస్టుల సమస్యలపై గళమెత్తడం, హక్కుల పరిరక్షణకు కృషి చేయడం, సంక్షేమానికి ప్రాధాన్యమివ్వడం తమ ప్రధాన లక్ష్యాలని నూతన కార్యవర్గం సంకల్పించింది. గౌరవ అధ్యక్షుడిగా గోపతి శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అల్లం కుమారస్వామి యాదవ్, కోశాధికారిగా మోదంపురం వెంకటేశ్, అధికార ప్రతినిధిగా ఎండీ షరీఫ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బచ్చల సుభాష్, కట్ట వెంకటేశ్, మెంగని శ్రీనివాస్, కార్యదర్శులుగా మందల మల్లేష్, ఎడ్ల...