తాళ్లపేట దుర్గామాత సన్నిధిలో ప్రత్యేక పూజలు...!

జనం పవర్ జర్నలిస్ట్ ఎస్ కే సద్దాం హుస్సేన్ అమ్మవారిని దర్శించుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగన్ మోహన్ రావు దండేపల్లి: భక్తి పారవశ్యం, ఆధ్యాత్మిక సందడితో తాళ్లపేట గ్రామంలో కొలువుదీరిన శ్రీ దుర్గామాత ఆలయం సందర్శకులతో కళకళలాడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగన్ మోహన్ రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. జగన్ మోహన్ రావు ఆలయానికి చేరుకున్న సందర్భంగా స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పండుగ వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలను చాటిచెప్పింది....