Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెలంగాణలో దసరా సెలవులు ఖరారు

    Author ఎడిటర్ తుడుం జితేందర్ | 05 Oct 2026, 02:09 PM |
    తెలంగాణలో దసరా సెలవులు ఖరారు

    తెలంగాణలో పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు దసరా సెలవులపై స్పష్టత వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు అక్టోబర్‌ 10 నుంచి 22 వరకు 13 రోజులపాటు సెలవులు ఉండనున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో విద్యార్థులకు వరుసగా సెలవులు లభించనున్నాయి. అక్టోబర్‌ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
    ఇక జూనియర్‌ కళాశాలలకు అక్టోబర్‌ 10 నుంచి 21 వరకు సెలవులు ప్రకటించారు. సెలవుల అనంతరం అక్టోబర్‌ 22న జూనియర్‌ కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సెలవుల షెడ్యూల్‌ను గమనించి విద్యా ప్రణాళికలను రూపొందించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.