Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దుర్గమ్మ ఉత్సవాలకు గల్ఫ్ అసోసియేషన్ అండ

    Author ఎడిటర్ తుడుం జితేందర్ | 14 Oct 2026, 08:26 PM |
    దుర్గమ్మ ఉత్సవాలకు గల్ఫ్ అసోసియేషన్ అండ

    జన్నారం మండలంలోని ధర్మారం గ్రామంలో తొలిసారి శరన్నవరాత్రి వేడుకలు.. రూ.23,113 విరాళం అందజేత


    భక్తి భావంతో పాటు సామాజిక బాధ్యతను చాటుకుంటూ ధర్మారం గల్ఫ్ అసోసియేషన్ సభ్యులు సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో తొలిసారిగా నిర్వహిస్తున్న దుర్గామాత శరన్నవరాత్రి పూజా మహోత్సవాల నిర్వహణకు రూ.23,113 ఆర్థిక సహాయం అందించారు. సభ్యులు స్వచ్ఛందంగా సమకూర్చిన ఈ మొత్తాన్ని ఉత్సవాల కోసం అందజేసి అమ్మవారి సేవలో తమ వంతు భాగస్వామ్యాన్ని చాటుకున్నారు.
    ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపకులు మగ్గిడి తిరుపతి, కట్కూరి లచ్చన్న, రాజు, రమేష్, రాజారావు, రాజలింగు కృష్ణ, సుదర్శన్, హరికృష్ణ, భగవాన్ దాసుతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ప్రజా సేవలోనూ ముందుంటూ సహకారం అందిస్తున్న గల్ఫ్ అసోసియేషన్ సభ్యులను గ్రామస్థులు అభినందించారు.