Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తాళ్లపేటలో బతుకమ్మ సంబరాలకు సర్వం సిద్ధం!

    Author ఎడిటర్ తుడుం జితేందర్ | 18 Oct 2026, 05:28 PM |
    తాళ్లపేటలో బతుకమ్మ సంబరాలకు సర్వం సిద్ధం!

    ఘనంగా వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి

    జనం పవర్, జర్నలిస్ట్ ఎస్.కే. సద్దాం హుస్సేన్


    దండేపల్లి: తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ పండుగ, రాష్ట్ర సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలకు దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామం ముస్తాబైంది. గ్రామంలో ఈరోజు నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గ్రామ ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి వెల్లడించారు.
    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగను గ్రామంలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
    గ్రామంలో పండుగ వాతావరణం వెల్లివిరిసేలా, వేడుకలు ప్రశాంతంగా సాగేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ బతుకమ్మ సంబరాల్లో భాగస్వాములు కావాలని కోరారు.