Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జన్నారం పోనకల్‌లోని అక్టోబర్ 4న మెగా ఉచిత వైద్య శిబిరం

    Author ఎడిటర్ తుడుం జితేందర్ | 03 Oct 2026, 08:58 PM |
    జన్నారం పోనకల్‌లోని అక్టోబర్ 4న మెగా ఉచిత వైద్య శిబిరం

    ముఖ్య అతిథిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

    జన్నారం: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో జన్నారం మండలం పోనకల్ గ్రామంలో అక్టోబర్ 4న మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. చందా న్యూరో అండ్ ట్రామా కేర్ సెంటర్ సహకారంతో పానకల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్, లయన్స్ క్లబ్ ఆఫ్ జన్నారం సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జన్నారం పోనకల్‌లోని పోలీస్ స్టేషన్ సమీపంలోని స్లేట్ సీబీఎస్‌ఈ పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్య శిబిరం కొనసాగనుంది. న్యూరో సర్జన్ డాక్టర్ చందా శ్రీనివాస్, రేడియాలజిస్ట్ డాక్టర్ కలువ లీలా శర్వాణితో పాటు డాక్టర్ స్వాతి, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ ఆలేఖ్య, క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ వంశీ తదితర వైద్యులు సేవలు అందించనున్నారు.
    నరాల బలహీనత, వెన్నుపూస, మెడ, చేతులు, కాళ్ల నొప్పులు, చేతులు-కాళ్లలో తిమ్మిర్లు తదితర సమస్యలకు ప్రత్యేక వైద్య పరీక్షలు, సలహాలు అందించనున్నారు. అలాగే షుగర్, బీపీ, ఈసీజీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్యుల సూచనలు అందించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నారు.
    గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చిన వైద్యులకు సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. పోనకల్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.