Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు మందమర్రి విద్యార్థి ఎంపిక

    Author ఎడిటర్ తుడుం జితేందర్ | 11 Oct 2026, 11:45 AM |
    రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు మందమర్రి విద్యార్థి ఎంపిక

    జనం పవర్ జర్నలిస్టు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి వేల్పుల నగేష్ అక్టోబర్ 11,

    కృష్ణవేణి టాలెంట్ పాఠశాలకు గర్వకారణంగా ఎస్‌.కె. షాహాబాజ్


    మందమర్రి: జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చాటుకుని రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై మందమర్రి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడు స్థానిక కృష్ణవేణి టాలెంట్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థి ఎస్‌.కె. షాహాబాజ్. తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న అండర్‌-17 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో అతడు పాల్గొననున్నాడు.
    ఈ నెల 12వ తేదీ నుంచి హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో షాహాబాజ్ తన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నాడు. జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. పట్టుదల, సాధనతో క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని షాహాబాజ్ ఎంపిక నిరూపిస్తోందని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి.
    రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని పాఠశాల డైరెక్టర్ రాంవేణు ఆకాంక్షించారు. క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. షాహాబాజ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, మందమర్రి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
    విద్యార్థి సాధించిన విజయంపై పాఠశాల ప్రిన్సిపాల్ గుణవతి, ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. షాహాబాజ్‌ను ప్రత్యేకంగా అభినందించి రాష్ట్రస్థాయి పోటీల్లో విజయవంతంగా రాణించాలని శుభాకాంక్షలు తెలిపారు. అతడి క్రీడా ప్రయాణం మరిన్ని విజయాలకు బాటలు వేయాలని పాఠశాల వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.